NationalNews

ఈడీపై జార్ఖండ్‌ సీఎం ఆగ్రహం

జార్ఖండ్‌ ప్రభుత్వంపై కేంద్ర సర్కార్‌ భారీ కుట్ర పన్నిందని సీఎం హేమంత్‌ సోరెన్‌ ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి పారిపోతాడనుకుంటున్నారా… అంటూ విచారణ సంస్థలపై హేమంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రతోనే తనపై అక్రమ కేసులు నమోదు చేశారని సీఎం ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తనను విదేశాలకు పారిపోయే వ్యక్తిలా ఈడీ అధికారులు ట్రీట్‌ చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. బ్యాంకులకు వేల కోట్లను ముంచేసి బడా వ్యాపారవేత్తలే దేశం విడిచి పారిపోయారని, ఒక్క రాజకీయ నాయకుడు కూడా అలా పారిపోయిన దాఖలాలు లేవని హేమంత్‌ సోరెన్‌ అన్నారు. మనీలాండరింగ్‌ కేసులో తనకు సమన్లు పంపడాన్ని హేమంత్‌ తప్పుబట్టారు. తనపై అనర్హత వేటు పడేలా అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ఉమ్మడి ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ లక్ష్యమని ఆరోపణ చేశారు. తన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలకు హేమంత్‌ చెప్పారు.