జాన్వీకి ఎక్స్ ఖాతా లేదు..దానిని నమ్మెద్దు..
దేవర బ్యూటీ జాన్వీకపూర్ తనకు సోషల్ మీడియా అంటే భయమని, తనకంటే తన చెల్లెలు ఖుషీనే దానిని ఎక్కువగా వాడుతుందని తెలియజేసింది. తాజాగా ఆమె పేరుతో ఎక్స్ ఖాతా లేదంటూ క్లారిటీ ఇచ్చింది ఆమె టీమ్. ఆమె పేరుతో ఉన్న ఎక్స్ ఖాతాలా అసభ్యకరమైన పోస్టులు దర్శనమివ్వడంతో ఈ సమాధానం వచ్చింది. ఆమెకు కేవలం ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మాత్రమే ఉందని, తన అభిమానులతో దాని ద్వారానే యాక్టివ్‌గా ఉంటారని పేర్కొన్నారు. ఈమధ్య ఫేక్ అకౌంట్లతో ఇబ్బందిగా మారిందని, ఈ డిజిటల్ ప్రపంచంలో ఎవరిపేరుతో అయినా అకౌంటు క్రియేట్ చేస్తున్నారని, నకిలీ ఖాతాలను గుర్తించాలని, వాటిని ఫాలో కావొద్దని జాన్వీ టీమ్ పేర్కొన్నారు. ఆమె ఇన్‌స్టాలో ప్రస్తుతం 24 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం దేవర షూటింగ్‌తో పాటు బాలీవుడ్ చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు జాన్వి.