NewsTelangana

టీఆర్‌ఎస్‌కు రోటీ మేకర్‌, రోడ్డు రోలర్‌ ఝలక్‌

టీఆర్‌ఎస్‌ను ఈసారి కూడా ఇండిపెండెంట్‌ అభ్యర్థులు దెబ్బ తీశారు. కారు గుర్తును పోలిన రోటీ మేకర్‌, రోడ్డు రోలర్‌ వల్ల టీఆర్‌ఎస్‌కు కొన్ని ఓట్లు తగ్గాయి. ప్రచారం చేయకున్నా.. అభ్యర్థి ఎవరో తెలియకున్నా కారును పోలిన గుర్తులకు ఏకంగా 3,215 ఓట్లు పడటమే దీనికి నిదర్శనం. రోడ్డు రోలర్‌కు 904 ఓట్లు, చపాతీ మేకర్‌కు 1169 ఓట్లు, చెప్పు గుర్తుకు 1142 ఓట్లు పడ్డాయి. రోడ్డు రోలర్‌, చపాతీ మేకర్‌ గుర్తులను తొలగించాలని ఈసీకి టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో టీఆర్‌ఎస్‌ ఆధిక్యత కాస్త తగ్గింది.