‘నా పేరుతో నగలా?’..ఆశ్చర్యంలో మహేశ్ బాబు తనయ..
హైదరాబాద్‌లోని పంజాగుట్టలోని పీఎంజే జ్యూయలరీ 40వ స్టోర్‌ను ప్రారంభించారు సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయ సితార. తన తల్లి నమ్రతతో కలిసి ఈ స్టోర్‌ను ప్రారంభించిన ఆమె తనకు నగలంటే ఎంతో ఇష్టమని, తన పేరుతో నగలు ఉన్నాయంటే చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. తన తండ్రి మహేశ్‌తో కలిసి జ్యూయెలరీ యాడ్‌లో నటించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తామిద్దరూ ఇంట్లో ఎలా ఉంటామో యాడ్‌లో కూడా అలాగే యాక్ట్ చేశామన్నారు. నమ్రత మాట్లాడుతూ సితార, తాను గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటామని, సితార ఏది నచ్చితే అది కొంటుందని పేర్కొన్నారు.

