Telangana

రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా జీవిత రాజశేఖర్ ప్రచారం

మునుగోడులో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా సినీ నటి జీవిత రాజశేఖర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చౌటుప్పల్ మండలంలోని దేవలమ్మ నాగారం గ్రామంలో ఆమె ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రజలతో కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలకరించారు. దేవలమ్మ నాగారానికి వచ్చిన జీవితకు అక్కడి మహిళలు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా గడప గడపకు తిరుగుతూ కమలం గుర్తుకు ఓటేయాలని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని భారీ మోజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తానే స్వయంగా గోరింటాకుతో మహిళల చేతులపైన కమలం గుర్తు వేసి.. దానికే ఓటేయ్యాలని కోరారు. ఇదిలా ఉంటే… రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా బీజేపీ కీలక నేతలు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపించి మునుగోడులో అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.