Home Page SliderTelangana

సొంత పార్టీపై జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. సంతోశ్ అనే వ్యక్తి గంగారెడ్డిని కారుతో ఢీకొట్టాడు.. ఆ తర్వాత కత్తితో పొడిచినట్లు స్థానికులు తెలిపారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ గంగారెడ్డిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు వెల్లడించారు. దీంతో జగిత్యాల- ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించిన జీవన్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. దీనిపై ఆందోళన చేసిన జీవన్ రెడ్డి ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందని మండిపడ్డారు. పక్క ప్లాన్ ప్రకారమే గంగారెడ్డిని హత్య చేసినట్టు ఎమ్మెల్సీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మమ్ములను చంపేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెక్కడ కాంగ్రెన్ పార్టీ అంటూ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో మాట్లాడుతూ.. ‘నీకోదండం.. నీ పార్టీకో దండం. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరిస్తున్నా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.