93 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను ప్రకటించిన జేడీఎస్
కర్ణాటక రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మాజీ సీఎం కుమారస్వామి ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమయ్యారు. 93 మంది అభ్యుర్థుల పేర్లతో మొదటి జాబితాను జేడీఎస్ విడుదల చేసింది. ఈ సారి కర్ణాటక ప్రజలు తమకే పట్టం కడతారని కుమార స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. మరో ఆరు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుండటంతో.. ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల వాడి కూడా రెట్టింపయ్యింది. ఎన్నికల షెడ్యూల్ రావడానికి మరో నాలుగు నెలలు పట్టే అవకాశం ఉన్నా… కుమారస్వామి మాత్రం అప్పుడే కదనరంగంలో కాలుమోపారు.

