Andhra PradeshHome Page Slider

వైజాగ్ నుంచే పోటీ చేస్తా-జేడీ

టిక్కెట్టు రాకపోతే స్వతంత్య్ర అభ్యర్థిగానైనా వైజాగ్ నుండే పోటీచేస్తానని మాజీ సీబీఐ చీఫ్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. గత కొంతకాలంగా రాజకీయాలలో చురుగ్గా ఉంటున్న లక్ష్మీనారాయణ ఈమధ్యనే వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించిన వేలంలో ఒక ప్రవేట్ కంపెనీ పేరుతో బిడ్లు వేశారు. తెలుగు ప్రజలందరూ నెలకు 100 రూపాయల చొప్పున ఇస్తే స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవచ్చని, తమకు సహకరించి క్రౌడ్ ఫండింగ్‌కు సహాయం చేయమని కోరుకున్న సంగతి మనకు తెలిసిందే. వైజాగ్ స్టీల్‌ప్లాంటును ప్రవేట్ పరం చేయొద్దని, తెలుగువారే దక్కించుకోవాలని ఆశించారు. ఇప్పడు వైజాగ్ నుండి రాబోయే ఎన్నికలలో పాల్గొంటానని ప్రకటించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ క్రౌడ్ ఫండింగును అమలాపురం నుండి మొదలుపెడతానని పేర్కొన్నారు.