Andhra PradeshHome Page Slider

టిడిపికి జయ మంగళ వెంకటరమణ గుడ్ బై

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జయ మంగళ..

• కాబోయే ఎమ్మెల్సీ అంటూ వార్తలు

• రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ సామాజిక వర్గ ఓట్లే జగన్ టార్గెట్

కైకలూరు నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది.అందరూ అనుకున్నట్లుగానే కైకలూరు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ జయ మంగళ వెంకటరమణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.2009లో కైకలూరు నుంచి తెలుగుదేశం పార్టీ లో గెలుపొందిన వెంకటరమణ ఇప్పటికీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. బుధవారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కైకలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పదవికి రాజీనామా చేసిన ఆయన గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు సయ్యపరాజు గుర్రాజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయ మంగళ వెంకటరమణ కు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన వెంకటరమణకు ఎమ్మెల్సీ ఇవ్వటం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డీ కులం ఓట్లు వైయస్సార్ కాంగ్రెస్ వైపు తిప్పుకునే వ్యూహంలో భాగంగానే వైయస్ జగన్ జయ మంగళ వెంకటరమణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.