డిసెంబర్ 7న జయహో బీసీ మహాసభ
డిసెంబర్ 8వ తేదీన చేపట్టాలనుకున్న బీసీల ఆత్మీయ సదస్సు ఒక రోజు ముందే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఎంపీ విజయ్ సాయి రెడ్డి తెలిపారు. గురువారం విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంని పర్యవేక్షించి, జయహో బీసీ మహాసభ పోస్టర్ ని బీసీ నాయకులు విడుదల చేశారు. 7వ తేదీ ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఈ సమావేశం సాయంత్రం వరకు కొనసాగనుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్ కీలక ప్రసంగం చేయనున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో జోనల్ వారీగా బీసీ మీటింగ్ లు పెట్టనున్నారని ప్రకటించారు.
అధికారంలోకి వచ్చాక బీసీ డిక్లరేషన్ లో చెప్పిన ప్రతి అంశాన్నీ ఈ ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని జంగా కృష్ణమూర్తి తెలిపారు. ఈ సమావేశంలో బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్,చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, ఎంపీ మోపిదేవి వెంకట రమణ, మార్గాని భరత్ తదితరులు హాజరయ్యారు.

