కుంభమేళా ఘటనపై జయాబచ్చన్ సంచలన వ్యాఖ్యలు
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాకు వచ్చే సామాన్య ప్రజల కోసం ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శలు కురిపించారు. కోట్లాది ప్రజలు కుంభమేళాకు వచ్చారని లెక్కలు చెప్తున్నారని, అంత మంది ఆ ప్రదేశానికి ఎలా చేరుకున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కుంభమేళాలో నీరు అత్యంత కలుషితంగా తయారయ్యిందని, అక్కడ మరణించినవారి మృతదేహాలను నదిలో విసిరేస్తున్నారని, ఈ విషయంపై స్పష్టత ఇవ్వడం లేదని మండిపడ్డారు.