సరికొత్త రికార్డు సృష్టించిన జవాన్ ట్రైలర్
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా “జవాన్” ట్రైలర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. కాగా విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. విడుదలైన 24 గంటల్లోనే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌పారమ్‌లలో మొత్తం 112 మిలియన్ వ్యూస్ సాధించింది. దీంతో జవాన్ ట్రైలర్ సరికొత్త రికార్డు సృష్టించిందని సినీ వర్గాలు ట్వీట్స్ చేస్తున్నాయి. ఈ ట్రైలర్‌లో చూపించిన యాక్షన్ సీన్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయని అభిమానులు చెబుతున్నారు. తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. కాగా తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు.అయితే ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకులు ముందుకు రానుంది.