హైద్రాబాద్ హనుమాన్ ఆలయంలో జాన్వీకపూర్
వెండితెర అలనాటి తార శ్రీదేవి తనయ జాన్వీకపూర్ హనుమాన్ ఆలయంలో ప్రత్యక పూజలు నిర్వహించారు. మధురానగర్‌లోని హనుమాన్ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు జాన్వీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆమె పేరుతో ప్రత్యేక అర్చన చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం పలువురు ఆమెను శాలువా,పూలమాలలతో ఘనంగా సత్కరించారు.జాన్వీ ఆలయానికి వస్తున్న సమాచారంతో స్థానికులు,పరిసర ప్రాంతవాసులు ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకుని ఆమె తో కరచాలనం చేసి సెల్ఫీలు దిగారు.

