సోషల్ మీడియా వేదికగా స్టార్ కిడ్స్ ఎదుర్కొంటున్న ట్రోల్స్‌ను ఉద్దేశించి నటి జాన్వీకపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తదుపరి చిత్రం ఉలఝ్ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. నటి జాన్వీకపూర్. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోషల్ మీడియా ట్రోల్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు పబ్లిక్ ఫిగర్ అయినా, కాకపోయినా ఇలాంటివి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ కామెంట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ముక్కూ, మొఖం తెలియనివాళ్లు ఏదో అన్నారని ఇంట్లో కూర్చొని ఏడవడం ఎందుకు. మనకు మనమే ప్రూవ్ చేసుకోవాలని చెప్పారు.
ఉలఝ్ విషయానికి వస్తే.. జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా తెరకెక్కించారు. జంగ్లీ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. జాన్వీ ఇందులో ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిణిగా కనిపించనుంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో గుర్షన్ దేవయ్య, రాజేష్ థైలాంగ్ ముఖ్య పాత్రలు పోషించారు.