రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి మద్యం వ్యాపారి అంటూ దుయ్యబట్టారు. జగన్ చెప్పే మాటలకు చేతలకీ పొంతన ఉండదన్నారు. దళితులపై దాష్టీకాల్లో దేశంలోనే రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టారన్నారు. అలాంటి వ్యక్తి తిరిగి అధికార పీఠంపై కూర్చోరాదన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు. ఒక మాట, అటూ ఇటూ అయినా పొత్తుతోనే ముందుకెళ్తామన్నారు పవన్ కల్యాణ్. రాజోలు, రాజానగరం నుంచి జనసేన అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగుతారన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఒక ఆర్ తోపాటుగా మరో రెండు ఆర్‌లు కలిసి త్రిబుల్ ఆర్ అంటూ పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

