జనసేన మాతోనే ఉంటుంది-పురంధరేశ్వరి
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నేడు బాధ్యతలు స్వీకరించారు పురంధరేశ్వరి. ఈ సందర్భంగా జనసేనతో పొత్తు విషయంలో క్లారిటీ ఇచ్చారు. జనసేన మాతోనే ఉంటుందన్నారు. ‘నిన్నా ఉన్నాం, నేడూ ఉన్నాం, రేపు కూడా జనసేనతోనే ఉంటామని’ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంటుందన్నారు. రోడ్ల నిర్మాణాలకు కేంద్రం వేల కోట్లు ఇచ్చినా, వైసీపీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణం చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు 20 లక్షల ఇళ్లు ఇచ్చిందన్నారు. ఈరోజు మాజీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నుండి పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అందుకున్నారు పురంధరేశ్వరి. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ సెక్రటరీ విష్ణు వర్థన్ రెడ్డి సహా ముఖ్య బీజేపీ నాయకులంతా పాల్గొన్నారు