డిపాజిట్ కూడా దక్కని జనసేన…నిరాశలో పవన్
తెలంగాణ ఎన్నికలలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. మొదటిసారిగా తెలంగాణలో పోటీ చేసిన జనసేన పార్టీ తన ఖాతాను తెరవలేక పోయింది. దీనితో జనసేనాని పవన్ కళ్యాణ్‌కు నిరాశ ఎదురయ్యింది. అంతే కాక కనీస ఓట్లను కూడా సాధించి, డిపాజిట్‌ను కూడా దక్కించుకోలేక పోయింది. బీజేపీ పార్టీతో పొత్తులో భాగంగా జనసేనకు 8 సీట్లు కేటాయించారు. ఖమ్మం, కొత్తగూడెం, వైరా, కూకట్ పల్లి, తాండూరు, కోదాడ, అశ్వారావుపేట, నాగర్ కర్నూల్‌లలో జనసేన పోటీకి దిగింది. తమ అభ్యర్థుల కోసం పవన్ కళ్యాణ్ భారీగా ప్రచార సభలు కూడా నిర్వహించారు. ప్రజలు సభలకు హాజరయినప్పటికీ ఓట్లు మాత్రం వేయలేదు.