కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జనసేన వార్నింగ్
సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జనసేన పార్టీ వార్నింగ్ ఇచ్చింది. జనసేన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. జనసేన పార్టీతో జానీ మాస్టర్‌కు ఎలాంటి సంబంధం ఉండకూడదని, తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని, అత్యాచారం చేశారని ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో జనసేన పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. వైసీపీ నేతలు జానీ మాస్టర్ జనసేనకు చెందినవాడని పేర్కొంటూ ఇప్పటికే ఈ విషయంపై జనసేనపై విమర్శలు చేస్తున్నారు. దీనితో ఎలాంటి అపోహలకు, అనుమానాలకు తావు లేకుండా జనసేన పార్టీ ఈ ప్రకటన చేసింది.