జనసేన సూపర్ వైజర్ చంద్రబాబే..!
జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ మతిభ్రమించి మాట్లాడారాని వైసీపి అధికార ప్రతినిధి,మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన ఆవిర్భావ సభ నిర్వహించినట్లు లేదని….తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ని తిట్టించడం కోసమే సభ పెట్టినట్లుందని ఎద్దేవా చేశారు.జనసేన నుంచి పోటీ చేసి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపిలు చంద్రబాబు మనుషులే అని ఆయన ఎప్పుడు పార్టీ మారమంటే మారిపోతారని పవన్ కి చురకలంటించారు.జనసేన సూపర్ వైజర్ చంద్రబాబే అని దాని నిర్వహణ మొత్తం చూసేది సీఎంయే అని ఎద్దేవా చేశారు.ఈ మాత్రం దానికి పార్టీ పెట్టాలా ..దానికొక ఆవిర్భావ సభ నిర్వహించాలా అంటూ వ్యంగాస్త్రాలు విసిరారు అంబటి.21 సీట్లు సాధించి స్ట్రైక్ రేట్ 100శాతం సాధించాననే పిచ్చి భ్రమ నుంచి పవన్ బయటికి రావాలని హితవు పలికారు.