Andhra PradeshNews

ఇప్పటం బాధితులకు జనసేన ఆర్థిక సాయం

ఇటీవలే మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం వివాదం తీవ్ర దుమారం రేగింది. ఇప్పటంలో రోడ్డు విస్తరణ విషయంలో ప్రభుత్వం ఇళ్లను కూల్చివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. ఇప్పటంలో ఆవాసాలు కోల్పోయిన వారితోపాటు.. ఇళ్లు దెబ్బతిన్న వారికి అండగా నిలవాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఇళ్లు కూల్చివేతకు గురైన వారికి జనసేన పార్టీ తరఫున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. బాధితులకు ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. త్వరలోనే పవన్‌ కల్యాణ్‌ ఆర్థిక సహాయాన్ని స్వయంగా అందజేయనున్నారు.