Andhra PradeshHome Page Slider

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు..

ఏపీ: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు ప్రారంభించింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 15-20 నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తయ్యాయి. ఇప్పటివరకు విశాఖ, విజయనగరం, తూ.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని స్థానాలపై సమీక్షించగా, ఇవాళ మరికొన్ని నియోజకవర్గాల సీట్లపై చర్చించనున్నారు.