తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై జానారెడ్డి రియాక్షన్
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మల్లన్న చేసిన కామెంట్లపై జానారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మల్లన్నగాలి మాటలు మాట్లాడితే కుదరదు. తప్పు చేసినవాడిని క్షమించే గుణం నాది.. నన్ను ఎవరు తిట్టినా నేను పట్టించుకోనని జానారెడ్డి పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న ప్రెస్మీట్ పెట్టుకుంటే ఏంది?.. ఇంకేమైనా పెట్టుకుంటే నాకేంటి? అంటూ జానారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. పార్టీ నాయకులు ఏమైనా సలహాలు, సూచనలు అడిగితే తప్పకుండా చెబుతానని అన్నారు.

