రామాయణం వీడియోని షేర్ చేసిన జమ్ము సీఎం
జమ్ముకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు డిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే..ఆయన ఇండియా కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.మనం మనం కొట్టుకుంటూ ఉంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి. మీరు ఇంకా కొట్టుకోండి…ఇంత కన్నా దారుణ ఫలితాలు చవిచూస్తారు..అంటూ ఆయన ఎక్స్‌లో రామాయణం వీడియోని పోస్ట్ చేశారు. కూటమి కుమ్ములాటలతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఒమర్ పోస్ట్ చుట్టూ మీడియా హైప్ పెరిగిపోయింది.

