NationalNewsSports

రేపటి నుంచే జల్లికట్టు…

తమిళనాడు పురాతన సంప్రదాయ క్రీడ జల్లికట్టు. ప్రతి సంక్రాంతి సీజన్ లో తమిళనాట జల్లికట్టు పోటీలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంక్రాంతి సీజన్ ను పురస్కరించుకుని రాష్ట్రంలో రేపటి నుంచి జల్లికట్టు పోటీలు నిర్వహించుకోవడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాస్తవానికి జనవరి 1 నుంచి ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ పొటీల నిర్వహణపై వివాదాలు ఉండడంతో పాటు కేసు సుప్రీంకోర్టు విచారణలో కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంది. జల్లికట్టు కోసం ప్రజల నుంచి డిమాండ్లు అధికమవుతుండడంతో, నూతన మార్గదర్శకాలతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈసారి జల్లికట్టు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అనుమతిని తప్పనిసరి చేసింది.