IPLలో అదరగొడుతున్న జైస్వాల్..టీమ్ఇండియాలోకి ప్రవేశిస్తారా?
టీమ్‌ఇండియాలో ఆడేందుకు యువ ఆటగాళ్లు పోటి పడుతున్నారు. కాగా IPLను దీనికి వేదికగా మార్చుకుని సమరానికి సై అంటున్నారు.అయితే ఈ IPL సీజన్‌లో ముఖ్యంగా యువ ఆటగాళ్లు తమ ఆటతో అదరగొడుతున్నారు. టీమ్‌లోని సీనియర్లకు ధీటుగా పరుగులు చేస్తూ..అందరిచేత ఔరా అనిపిస్తున్నారు. ఈ విధంగా టీమ్‌ఇండియాలోకి ప్రవేశించేందుకు మార్గాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి. తాజాగా జరిగిన PBKS VS RR మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. అయితే ఈ గెలుపు సాధించడంలో యశస్వి జైస్వాల్ కీలక పాత్ర పోషించాడు.కాగా ఈ మ్యాచ్‌లో జైస్వాల్ అర్థశతకం సాధించాడు. అంతేకాకుండా ఈ IPL సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన 14 మ్యాచుల్లో జైస్వాల్ 625 పరుగులు చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్‌ను టీమ్‌ఇండియాలోకి తీసుకోవాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా జైస్వాల్‌కు మద్దతు పలికారు. అతడిని తప్పకుండా టీమ్‌ఇండియాకు ఎంపిక చేయాలని సూచించాడు. కాగా యశస్వి జైస్వాల్‌కు సాంకేతికంగా అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయని సునీల్ గవాస్కర్ అభినందించాడు.