‘ఆదిపురుష్’ నుండి అదిరిపోయేలా ‘జైశ్రీరాం’ ఫుల్ సాంగ్ రిలీజ్
రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరామునిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ నుండి ‘జైశ్రీరాం’ అంటూ ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. దీనితో ప్రేక్షకులు చాలా ఖుషీ అవుతున్నారు. రామునిగా ప్రభాస్, సీతగా కృతిసనన్,రావణునిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ పాటకు ముందు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘ఎవరు ఎదురు రాగలరు మీ దారికి’ అంటూ వానరుల నుద్దేశించి శ్రీరాముడు మాట్లాడారు. ఈ పాటకు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫ్యాన్స్ అందరూ బాగుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రతీ శ్రీరామ నవమికి ఈ పాట వినిపిస్తుందని చెప్తున్నారు. ఈపాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూర్చగా, సంగీత దర్శకులు అజయ్-అతుల్ స్వరాలు అందించారు.