Home Page SliderInternational

న్యూయార్క్ నుండి జై తెలంగాణ నినాదాలు

బతుకు దెరువు కోసం దేశ దేశాల్లో  ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు కూడా తెలంగాణ ఉద్యమంలో తమ వంతు సహాయం చేశారు. పాతికేళ్ల తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (TDF) పూర్తయిన సందర్భంగా దాని మాజీ ప్రెసిడెంట్ లక్ష్మణ్  ఏనుగు శుభాకాంక్షలు తెలిపారు. న్యూయార్క్ నుండి జై తెలంగాణ నినాదాలు చేశారు.  తాము కూడ బెట్టిన దాంట్లో కొంత తెలంగాణ సాధన కోసం ప్రవాసులు ఖర్చు పెట్టి మరీ కృషి చేశారు. పాతికేళ్ల తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (TDF) పూర్తయిన సందర్భంగా దాని మాజీ ప్రెసిడెంట్ లక్ష్మణ్  ఏనుగు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆకాంక్షిస్తూ, రాష్ట్ర సాధనలో మేము సైతం అంటూ ప్రవాస తెలంగాణ వాదులు ఏర్పాటు చేసుకున్న సంస్థే తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్. ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో మలి ఉద్యమంలో మొలచి, వృక్షంలా ఎదిగింది తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్. పది మందితో అమెరికా కేంద్రంగా  న్యూయార్క్ నగరం లో 1999 లో ఏర్పాటైన తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ ఆ తర్వాత శాఖోపశాఖలుగా వివిధ దేశాల్లో విస్తరించింది. పొట్టకూటి కోసం గల్ఫ్ బాట పట్టిన కార్మికుడు మొదలు, ఆస్ట్రేలియా, అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే యువకుడు కూడా జై తెలంగాణ అనే నినాదించేలా చేసిన సంస్థ TDF. పరాయి పాలనలో జరిగిన మోసాలను, పక్కదారి పట్టిన నిధులను, నీటి కేటాయింపులో జరిగిన మోసాలను సమాజంలోని ప్రతీ ఒక్కరూ గుర్తించటంతో పాటు, అన్యాయాలపై సొంతగా వారు వాదించే స్థాయికి ఎదిగేలా టీడీఎఫ్ కృషి చేసింది.  ఒక దశ లో నిద్రపోతున్న రాజకీయ నాయకులను మేలుకొలిపిన ఘనత TDF. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మారినా తెలంగాణ ఏర్పాటు లక్ష్యాల నుంచి మరలకుండా పాలన, విధాన నిర్ణయాలు ఉండేలా జాగురకతో టీడీఎఫ్ వ్యవహరిస్తోంది. నిర్ణయాలు గాడి తప్పిన సందర్భాల్లో ఉద్యమ పంథానే కొనసాగిస్తూ పాలకులను, పార్టీలను ప్రశ్నించటంతో ముందు ఉంటోంది డెవలప్ మెంట్ ఫోరమ్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు దాటనా ప్రభుత్వాలు ప్రత్యేక ఎన్నారై పాలసీని ప్రకటించకపోవడం రాష్ట్ర సాధనలో ఒక లోటు. టీడీపీ సాధించలేకపోయినా లక్ష్యాలలో ఇదీ ఒకటి. సమీప భవిష్యత్తులోనే ఎన్నారై పాలసీ రూపుదిద్దుకుంటుందనే ఆశాభావంతో టీడీఎఫ్ ఉంది. ప్రత్యేక తెలంగాణలో విద్యావంతులుగా ఎదిగి, దేశ విదేశాల్లో స్థిరపడుతున్న యువత చేతుల్లో టీడీఎఫ్ మరింత బలంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు ఏనుగు లక్ష్మణ్.