జై భీమ్ దర్శకుడు రజనీకాంత్ 170వ చిత్రం నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ 170వ చలన చిత్రం కోసం లైకా ప్రొడక్షన్స్‌తో మళ్లీ కలుస్తున్నట్లు బ్యానర్ గురువారం తెలిపింది. ప్రొడక్షన్ హౌస్ వ్యవస్థాపకుడు సుభాస్కరన్ అల్లిరాజా పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం పేరు పెట్టని ఈ చిత్రానికి జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నట్టు మేకర్స్ తెలిపారు. అనిరుద్ సంగీతం అందిస్తుండగా సుభాస్కరన్ నిర్మించనున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో మా తదుపరి అనుబంధాన్ని ప్రకటించడం గౌరవంగా భావిస్తున్నామని… . విమర్శకుల ప్రశంసలు పొందిన జ్ఞాన్‌వేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని లైకా ప్రొడక్షన్స్ పేర్కొంది. సంచలనాత్మక రాక్‌స్టార్ అనిరుధ్ సంగీతం అందిస్తారని లైకా ప్రొడక్షన్స్ ట్విట్టర్‌లో పోస్ట్‌లో చేసింది.
నిర్మాత జికెఎమ్ తమిళ్ కుమరన్ నేతృత్వంలో ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని, 2024లో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ తెలిపారు. పలు విజయవంతమైన ప్రాజెక్ట్‌ల తర్వాత మరోసారి తలైవా రజనీకాంత్‌తో మళ్లీ మూవీ తీస్తున్నామని లైకా అభిప్రాయపడింది. ఇండస్ట్రీలో తలైవా మూవీ… కొత్త శిఖరాలను చేరుకుటుందని… అభిమానులను అలరిస్తుందని సంస్థ అభిప్రాయపడింది.