రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా జై బాపు, జై భీం, జై సంవిధాన్
జై బాపు, జై భీం, జై సంవిధాన్ తో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.రాష్ట్ర ఎమ్మెల్సీ ఆమెర్ ఆలీఖాన్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ ర్యాలీ కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం నుండి ప్రధానవీధులు గుండా కొనసాగుతూ అంబేద్కర్ చౌక్ మీదుగా చాందా వరకు సాగింది. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంచుకుందని ఎమ్మెల్సీ ఆమెర్ ఆలీఖాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.