జాగృతి కవిత అరెస్టు
హైదరాబాద్: సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ లక్డీకపూల్ వద్దనున్న సింగరేణి భవన్ ముట్టడికి తెలంగాణ జాగృతి, హెచ్ఎంఎస్ యత్నించాయి. ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో హెచ్ఎంఎస్, జాగృతి కార్యకర్తలు, నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడంతో… జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ముట్టడిలో పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి భవన్ ఎదుట ఆందోళనకు దిగిన కవితను పోలీసులు అదుపులోకి తీసుకొని నాంపల్లి స్టేషన్‌కు తరలించారు. కవిత వస్తోందన్న ముందస్తు సమాచారంతో పోలీసులు బందోబస్తు పెంచగా, కవిత ఆటోలో వచ్చి సింగరేణి భవన్
ముట్టడికి యత్నించారు.

