Home Page SliderTelangana

జగిత్యాలలో కల్తీపాలు.. ఆసుపత్రి పాలైన మహిళ

జగిత్యాలలో కల్తీపాలు తీవ్ర కలకలం రేపాయి. ఆ పాలను తాగిన ఓ కుటుంబం తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని కరబుజ లావణ్య కుటుంబం కొద్ది రోజుల నుంచి మేడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన రైతు మైదం మల్లయ్య దగ్గర పాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అవి తాగిన లావణ్య కుటుంబం అనారోగ్యానికి గురైంది. ఒంటిపై దద్దుర్లు, విరేచనాలు కావడంతో ఆస్పత్రి పాలయ్యింది. అయితే కల్తీ పాల వల్లే ఇలా జరిగిందని అనుమానం వచ్చింది. మరోవైపు పాలు డెటాల్, యూరియా వాసన రావడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ కు కంప్లైంట్ చేశారు. ఆ పాలను టెస్ట్ చేయించగా అందులో 10 శాతం కూడా పాలు లేవని తేలింది. దీంతో మల్లయ్య పోస్తున్న పాల శాంపిల్స్ సేకరించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష అతడి ఇంట్లో సోదాలు చేపట్టారు.