Home Page SliderTelangana

హరీష్ రావుకు జగ్గారెడ్డి సవాల్

రుణమాఫీపై హరీష్ రావు ఢిల్లీలో ధర్నా చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తుండని హరీశ్ ఢిల్లీలో ఫ్లయిట్ దిగే లోపే తాను కేసీఆర్ ఫామ్ హౌజ్ ముందు ధర్నాకు కూర్చుంటానని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ గాంధీభవన్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు రైతులను మోసం చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర దీక్ష చేస్తానని రాసిపెట్టుకోమని హరీష్ రావుపై మండిపడ్డారు. హరీశ్ దొంగ దీక్షలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు. రుణమాఫీ కోసం ఆగస్టులో ప్రభుత్వం రూ. 18 వేల కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. రుణమాఫీ కోసం ఇంకో రూ. 12 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.