Andhra PradeshHome Page Slider

సీక్రెట్ కెమెరాల ఘటనపై జగన్ ఆందోళన

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ నేత జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్లల జీవితాలను అతలాకుతలం చేసిన ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని విచారణలు జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకుని కఠిన శిక్ష విధించాలని కోరారు. కూటమి పాలనలో 3 నెలల్లోనే విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వ సంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు చేశారు. ఈ ఘటనపై విద్యార్థినులతో మహిళా వైసీపీ నేతలు మాట్లాడారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. విద్యార్థినులు శాంతించకపోవడంతో కాలేజీతో పాటు, హాస్టల్‌కు కూడా 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు.