హై కోర్టులో జగన్ పిటిషన్..
వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ పార్టీ అధ్యక్షుడు జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్‍ను ఆదేశించాలని హైకోర్టును కోరనున్నారు. గతంలో ఈ విషయంపై లేఖ రాసినా ఇవ్వలేదని పిటిషన్‍లో పేర్కొన్నారు జగన్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీకి 11 సీట్లు మాత్రమే రావడంతో జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా దక్కదని ప్రభుత్వం చెప్తోంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కూడా 22 సీట్లు రావడం, జనసేన పార్టీ, టీడీపీకి మిత్రపక్షం కావడం, బీజేపీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉండడంతో వైసీపీ మాత్రమే ప్రతిపక్షంలో ఉన్నట్లు వైసీపీ పార్టీ వాదిస్తోంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఒక్కసీటు కూడా గెలుపొందని సంగతి తెలిసిందే.

