News

దొంగ చేతికి తాళం ఇచ్చింది జగన్ ప్రభుత్వం

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  విష్ణువర్ధన్ రెడ్డి ఏపీలో జగన్ ప్రభుత్వం దొంగల చేతికి తాళాలు ఇస్తోందని విమర్శలు చేశారు. కేంద్రంలో బీజేపీ తొమ్మిదేళ్ల పాలన సందర్బంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు, మాజీ సీఎంలు, ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయిలో బహిరంగ సభులు నిర్వహిస్తాం అనీ,   మంగళవారం అనంతపురంలో కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రిలో సోము వీర్రాజులు, అరకులో దగ్గుబాటి పురంధరేశ్వరి సభల్లో పాల్గొంటారని తెలియజేశారు. నిన్న ఐదు జిల్లాల్లో బహిరంగ సభలు జరగ్గా, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది అని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంలో జగన్ పాలన గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక, కంకర, గ్రానైట్, ఇతర ముడి సరుకు వసూళ్లను ప్రైవేటు వ్యక్తులకు చిత్తూరు, అనంతపురం , శ్రీకాకుళం , గోదావరి జిల్లాలలో  వనరులు దోపిడీ చేసేవారికిల ప్రభుత్వమే  అప్పగించిదని పేర్కొన్నారు. నయా దందా మొదలు పెట్టిందని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం నాలుగు ఇసుక విధానాలను మార్చి.. తమకు అనుకూలంగా మార్చుకున్నారన్నారు.  వనరులను కాపాడాల్సిన ప్రభుత్వమే వనరులను దోపిడీ చేయడం చాలా దుర్మార్గమని,  ఇసుకను ఇక్కడ  అమ్మకుండా.. ఇతర రాష్ట్రాలకు దర్జాగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడే శక్తి, హక్కు ప్రభుత్వ అధికారులకే ఉంటుందన్నారు.

ఏవైనా లోపాలు ఉంటే.. చట్టబద్దంగా వారు చర్యలు తీసుకోవచ్చన్నారు.  కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టులకు జిల్లాల వారీగా వసూళ్లు చేసుకునేలా అమ్మేశారు. ఇలాగే  ఇసుక విషయంలో 700కోట్లు ప్రభుత్వానికి చెల్లించి, 7వేల కోట్లు కాంట్రాక్టు సంస్థ దోచుకుంది వాస్తవం కాదా?” అంటూ ప్రశ్నించారు. .  ఏపీలో ఉన్న ఖనిజ సంపద మరెక్కడా లేదని, ప్రభుత్వ సంపదను దోచే కుట్రను విరమించుకోవాలని బీజేపీ పార్టీ  డిమాండ్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.