Andhra PradeshHome Page Slider

సిక్కులకు జగన్ వరాల జల్లు

ఏపీలోని సిక్కుమతస్థులకు వరాల జల్లు కురిపించారు ముఖ్యమంత్రి జగన్. సిక్కుల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా అంగీకరించారు. సిక్కుమత పెద్దలు ఈరోజు జగన్‌ను తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో కలిసారు. తమ ప్రార్థనా స్థలాలైన గురుద్వారాలకు ఆస్థిపన్నులు మినహాయించాలని కోరారు. గురుద్వారాలోని గ్రంధీలకు దేవాలయాలలో పూజారులు, చర్చిలలో ఫాస్టర్ల ,మౌలాలీలకు అందే ప్రయోజనాలు కల్పించాలని కోరుకున్నారు. వీటన్నింటికీ ముఖ్యమంత్రి జగన్ అంగీరించారు. పది రోజులలోగా వారికి ఇవన్నీ అమలు జరగాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక వారి పండుగలైన గురునానక్ జయంతికి, కార్తీక పౌర్ణమికి సెలవు మంజూరు చేయడానికి కూడా అంగీకరించారు.