ఏపీలో దాడులకు నిరసనగా ఢిల్లీలో జగన్ ధర్నా
ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపై దాడులు పెచ్చరిల్లాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో దాడులకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేపట్టాలని జగన్ నిర్ణయించారు. ధర్నాను ఈ నెల 24న ఢిల్లీలో నిర్వహిస్తారు. ఈ ధర్నాలో వైసీపీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతోపాటుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ధర్నా తర్వాత వైెఎస్ జగన్, రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పిస్తారు. వినుకొండలో రషీద్ కుటుంబ సభ్యులను కలిసి జగన్ ధైర్యం చెప్పారు. పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

