Andhra PradeshHome Page Slider

జగన్ బస్సు యాత్ర.. షెడ్యూల్

ఏపీ: వైసీపీ అధినేత జగన్ నేడు ఇడుపులపాయ నుండి బస్సు యాత్రతో ఎన్నికల ప్రచార భేరీకి శ్రీకారం చుడుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, మ.1.30 నుండి కడప పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నారు. వేంపల్లి, వీఎన్ పల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రయాణించి సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డకు చేరుకుని, అక్కడ బస చేస్తారు.