జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు సీజ్
మాజీ ముఖ్యమంత్రి జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు సీజ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన పోలీసులు.. ఇన్ఛార్జ్ అప్పిరెడ్డికి నోటీసులు అందజేశారు. అనంతరం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేసి తీసుకెళ్లారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య ఆ కారు కింద పడి చనిపోయినట్లు వీడియోలో ఉందని నిన్న పోలీసులు వెల్లడించారు.