Home Page SliderTelangana

హరేకృష్ణ నినాదాలతో వైభవంగా పూరీ జగన్నాథుని రథయాత్ర

ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో  జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. సికింద్రాబాద్ ఇస్కాన్ దేవాలయం నుండి సికింద్రాబాద్ పురవీధుల మీదుగా జగన్నాథుడు రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. జగన్నాథుడి రథయాత్రలో పెద్ద సంఖ్యలో కృష్ణ భక్తులు పాల్గొని హరే కృష్ణ నినాదాలతో హోరెత్తించారు. జగన్నాథుడి రథాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రధాన్ని లాగేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటీపడ్డారు. రథయాత్ర ఆద్యంతం కన్నుల పండుగగా శ్రీకృష్ణ సంకీర్తనలతో శోభాయమానంగా సాగింది.