Home Page SliderTelangana

ఆదివారం జగన్నాథ స్వామి రథయాత్ర

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లోని జగన్నాథ స్వామి రథోత్సవం ఈ నెల 7న జరగనున్నది. అదే రోజు వనవాసానికి వెళ్లి స్వామి వారు తిరిగి ఈ నెల 15న ఆలయానికి వస్తారు. ఈ నెల 17 నుండి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వేడుక కోసం ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. పూరీలో మాదిరిగానే ఇక్కడ జగన్నాథ స్వామి రథయాత్ర ప్రతియేటా నిర్వహిస్తారు.