Andhra PradeshHome Page Slider

ఏపీలో జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల

ఏపీలో ఇవాళ సీఎం జగన్ జగనన్న విదేశీ విద్యా దీవెన,సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో జమ చేశారు. కాగా  ఏపీలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్న 390 మంది విద్యార్థులు అర్హత సాధించారు.ఈ మేరకు వీరి ఖాతాల్లో రూ.41.59 కోట్ల డబ్బులు జమ చేశారు. మరోవైపు ఏపీలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన మొత్తం 95 మందికి రూ.లక్ష చొప్పున వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. అంతేకాకుండా సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌లో క్వాలిఫై అయిన 11 మంది అభ్యర్థులకు రూ.1,50,000 ఇవ్వనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.