అచ్యుతాపురం సెజ్ బాధితులతో జగన్
అచ్యుతాపురం సెజ్ బాధితులను వైసీపీ నేతలు పరామర్శించారు. వైసీపీ నేత జగన్ అనకాపల్లి ఆస్పత్రిలో ఉన్న బాధితులను కలిసి పరామర్శించారు. వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, ధర్మశ్రీ ఇతర వైసీపీ నేతలు కూడా ఉన్నారు. ఎసెన్షియా ఫార్మా బాధితులను కలిసి, వారి కుటుంబాలను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితి గురించి తెలుసుకున్నారు. వారి ప్రమాద తీవ్రతను, వారు కోలుకోవడానికి ఎంతకాలం పడుతుంది వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాద బాధితులకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.