Andhra PradeshHome Page Slider

“జగన్ ఢిల్లీ వెళ్లింది పొత్తు కోసమే”:మంత్రి పయ్యావుల

ఏపీ మాజీ సీఎం జగన్ నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాష్ట్రంలో జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. కాగా దీనిపై మంత్రి పయ్యావుల సెటైర్లు వేశారు. ఇండియా కూటమితో పొత్తు కోసమే జగన్ ఢిల్లీ వెళ్లనట్లుందని మంత్రి ఆరోపించారు. అయితే ఢిల్లీ నుంచి అమరావతి వచ్చిన జగన్ అసెంబ్లీకి కూడా రావాలని ఆయన డిమాండ్ చేశారు.కాగా జగన్ అసెంబ్లీకి వచ్చి ఆయన చెప్తున్న రాజకీయ హత్యల వివరాలు సభలో పెట్టాలన్నారు. అయితే దీనిపై చర్చలు జరిపి సమాధానాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. జగన్ ఢిల్లీ రోడ్లపై శాంతి భద్రతలపై గగ్గోలు పెట్టడం దేనికని ఆయన ప్రశ్నించారు. కాగా లా అండ్ ఆర్డర్‌పై ఇవాళే మా ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తుందని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు.