“జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు”: సోమిరెడ్డి
ఏపీలో ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు.ఈసారి ఏపీలో బ్యాలెట్ ఓటింగ్ విధానం అమలు చేయాలని..ఈవీఎం ఓటింగ్ విధానాన్ని రద్దు చేయాలని జగన్ ట్వీట్ చేశారు.కాగా దీనిపై మాజీ మంత్రి,టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమెహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ..ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి ఆయన ఇంకా తేరుకోలేదన్నారు.కాగా మాజీ సీఎం జగన్ ఏపీ ఎలాన్ మస్క్‌లా మాట్లాడుతున్నారన్నారు. ఏపీలో సీఎంగా గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా? అని ఆయన ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిచినప్పడు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఈ మేరకు మాజీ సీఎం పరనింద ..ఆత్మ స్తుతి మానుకొని ఇకనైనా ఆత్మ విమర్శ చేసుకోవాలని సోమిరెడ్డి సూచించారు.

