జగన్ మెడికల్ కళాశాలల టెండర్లు పాడుకొని.. అభివృద్ధి చేయండి
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికు సవాల్ విసిరారు. “చేతనైతే మీరూ మెడికల్ కళాశాలల్లో టెండర్లు పాడుకొని అభివృద్ధి చేయండి” అని విమర్శలు గుప్పించారు ఈ సందర్బంగా, కేంద్ర మంత్రి గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలను స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్‌తో కలిసి పరిశీలించారు. కళాశాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల పరిస్థితిపై అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను ఎప్పుడో ఒకసారి మోసం చేయవచ్చు, కానీ ప్రతిసారి మోసం చేయలేరని చెప్పారు. గుంటూరు, రాజధాని ప్రాంత ప్రజలు తెలివిగలవారని, ఎవరికీ అధికారం ఇవ్వాలో బాగా తెలుసనీ, మంగళగిరి ఎయిమ్స్‌కు గత వైసీపీ పాలనలో కనీసం నీళ్లు, రోడ్లు కూడా అందించలేకపోయిన పరిస్థితిని గుర్తు చేశారు.కేంద్ర మంత్రి సెటైర్లు వేస్తూ, టీడీపీ హయాంలోనే మెడికల్ కళాశాలకు అనుమతి తీసుకున్నారని. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి అది తానే చేసినట్లు ప్రచారం చేస్తుండడం “విడ్డూరంగా” ఉందని విమర్శించారు. పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలు వైసీపీ అధినేత జగన్ రెడ్డిపై ప్రత్యక్ష విమర్శలుగా, రాజకీయ వాతావరణంలో సవాల్ రూపంలో నిలిచాయి.