జగన్ మానసిక స్థితి బాగాలేదనిపిస్తోంది..
గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. ప్రజలు నవ్వుకుంటారేమోనని కూడా ఆలోచించకుండా జగన్ మాట్లాడుతున్నారన్నారు. గుంటూరు మిర్చి యార్డు చరిత్ర తెలుసుకోకుండా జగన్ ఇష్టానుసారంగా మాట్లాడారు. పనికిమాలిన పేపర్, టీవీని అడ్డం పెట్టుకొని ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది జగన్ అవివేకమని మంత్రి పేర్కొన్నారు. జగన్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి బాగాలేదనిపిస్తోందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.

