పోసాని భార్యకు జగన్ ఫోన్
నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని నిన్న హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పోసాని గతంలో వైసీపీకి మద్దతుగా నిలిచారని, టీడీపీ, జనసేన నేతలపై అనుచితంగా మాట్లాడారన్న ఆరోపణలతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోసానిని అరెస్టు చేశారు. ఆయన సతీమణి కుసుమలతకు వైసీపీ అధినేత జగన్ ఫోన్ చేసి పరామర్శించినట్లు సమాచారం. ఆమెకు, పోసాని కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైసీపీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్ సహా ఇతర నాయకులను కూడా రైల్వే కోడూరు కోర్టుకు పంపినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలనకు పాల్పడుతోందని, పోసాని విడుదలకు న్యాయపరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.

