గుర్లలో జగన్ పరామర్శ
విజయనగరం జిల్లా గుర్లలో జగన్ పర్యటిస్తున్నారు. అక్కడ డయేరియాతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్నారు. వారిని ఓదార్చి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గుర్లలో డయేరియా బారిన పడి 14 మంది మరణించారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత సెప్టెంబరులోనే డయేరియా ప్రమాదం పొంచిఉన్నదని వైద్యులు హెచ్చరించినా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

