Andhra PradeshNewsNews Alert

తెలంగాణ నుండి రావాల్సిన బకాయిలు ఇప్పించండి


విభజన చట్టంలోని అంశాలు ఇంకా పూర్తి కాలేదు. పోలవరానికా నిధులు లేవు. విద్యుత్ బకాయిలా సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఇలాంటి సమస్యలు ఎన్నింటినో నెత్తికెత్తుకుని ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్ళారు. ప్రధాని నివాసంలో నరేంద్రమోడీని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు సత్వరమే విడుదల చేయాలని ప్రధానిని కోరారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు.. విభజన హామీలపై చర్యలు తీసుకోవాలని మోదీని కోరారు.

 పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం ఇప్పటి వరకు దాదాపు 2900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వాటన్నింటినీ రీయింబర్స్‌ చేయాలని కూడా ప్రధానిని కోరారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని విన్నవించారు.  అలాగే తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రావాల్సిన బకాయిల అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఎనిమిది సంవత్సరాలుగా ఆరు వేల కోట్లకు పైగా బకాయిలు అలానే ఉన్నాయని .. వాటిని వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జగన్ అభ్యర్ధించారు. రాష్ట్రానికి మరో 12 మెడికల్‌ కళాశాలలకు అనుమతులు ఇవ్వాలని ప్రధానిని కోరారు సీఎం జగన్. నిధుల సాధనే ప్రధాన అజెండాగా ఢిల్లీ వెళ్ళిన సీఎం జగన్ .. ప్రధాని తో పాటు కేంద్ర విద్యుత్ శాఖామంత్రి ఆర్కే సింగ్ ను కూడా కలుసుకున్నారు. అలాగే మర్యాద పూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కూడా సీఎం జగన్ కలుసుకున్నారు. ఏపీకి తెలంగాణ దాదాపు 6వేల కోట్ల రూపాయలు బకాయి పడింది. ఆ బకాయిల అంశంపై కేంద్ర మంత్రితో సీఎం జగన్ చర్చలు జరిపారు.